Tuesday, 20 December 2011

Komatireddy venkatareddy

రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకైక కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరు ముగ్గురూ సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మిగిలిన ఇద్దరిని సుచిత్ రెడ్డి చంద్రారెడ్డిగా గుర్తించారు. కారు డివైడర్ ను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గొర్రెలను తప్పించబోయి డివైడర్ కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో విద్యార్థి ఆరో రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ప్రతీక్ రెడ్డి మృతితో నల్గొండ జిల్లాలో విషాదచాయలు అలముకున్నాయి. కొడుకు మరణవార్త విని వెంకటరెడ్డి సోదరులు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి 10 గంటలకు వారు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. వెంకట రెడ్డికి ఒక్కడే కుమారుడు. ఒక కుమార్తె ఉన్నారు.

No comments: